top of page

ProZ Pro Bono గురించి క్లుప్తంగా

ఈ వెబ్‌సైట్‌లో ఎక్కువ భాగం ఇంగ్లీష్‌లో ఉంటుంది, అయితే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి మన స్నేహితులు, క్లయింట్లు వారి స్వంత భాషలో ఈ ప్రోగ్రామ్‌ గురించి తెలుసుకొనే అవకాశం ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము. కింది పేజీ ప్రాజెక్టును, ఇందులో పని చేస్తున్న వారిని, దీని ఉద్దేశ్యాన్ని వివరిస్తుంది. దీన్ని మా విలువైన వాలంటీర్లలో కొంతమంది అనువదించారు. మీరు ఏ భాషలోనైనా మాకు రాయవచ్చని, మేము అదే భాషలోనే మిమ్మల్ని సంప్రదిస్తామని కూడా దయచేసి గమనించండి.

ProZ Pro Bono గురించి క్లుప్తంగా

ఏమిటి, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు?

ఏమిటి?

ప్రపంచవ్యాప్తంగా వృత్తి నిపుణులైన అనువాదకులు, వ్యాఖ్యతల అతి పెద్ద కమ్యూనిటీ అయిన ProZ.com చేత నగదు రహిత చారిటీగా ProZ Pro Bono ప్రోగ్రామ్‌ ప్రారంభించబడింది. ఈ ప్రోగ్రామ్ అనువాదం, వ్యాఖ్యత సేవలు అవసరమైన లాభాపేక్ష లేని సంస్థలు, వ్యక్తులను భాషా నిపుణులతో పూర్తిగా స్వచ్చంద ప్రాతిపదికను అనుసంధానిస్తుంది. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా, అణగారిన కమ్యూనిటీల కోసం కీలకమైన సమాచారం, సేవలను అందుబాటులోకి తెచ్చేలా భాషాపరంగా మద్ధతు ఇచ్చే అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను ProZ.com ఏర్పాటు చేస్తుంది.​

ఎవరు?

ProZ Pro Bono ప్రోగ్రామ్‌ ప్రపంచవ్యాప్తంగా లాభాపేక్షలేని సంస్థలకు సేవలందిస్తుంది, ఈ క్రమంలో వారు బహుభాషల సమూహాలను చేరుకుంటారు, వారికి ఉన్న తక్కువ వనరులను వారి ప్రాథమిక లక్ష్యమైన అణగారిని వర్గాల సేవకు ఉపయోగించగలరు. ProZ.comలో నమోదు చేసుకున్న భాషా నిపుణులైన సభ్యులు అనువాదం మరియు వ్యాఖ్యాన పనులు చేసి పెడతారు. ఎవరికైతే సహాయం అవసరమవుతుందో వారికి ఎలాంటి రుసుము లేకుండా నైపుణ్యాన్ని అందించడం ద్వారా ఒక సానుకూల ప్రభావాన్ని కలిగించడంపై ఈ వ్యక్తులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. దీనికి ProZ.com సభ్యులు నిధులు సమకూర్చారు.​

ఎక్కడ?

​ ProZ Pro Bono ప్రోగ్రామ్‌ అంతర్జాతీయస్థాయిలో పని చేస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి భాషా నిపుణులు, లాభాపేక్ష లేని సంస్థలు పాల్గొనవచ్చు. ఈ ప్రోగ్రామ్‌ ProZ.com యొక్క వాస్తవిక స్వభావాన్ని మెరుగుపరుస్తుంది, దేశాల సరిహద్దుల వ్యాప్తంగా సహకారాన్ని ప్రారంభిస్తుంది. భౌగోళిక ప్రాంతాలతో సంబంధం లేకుండా వాలంటీర్లు వారి సేవలను అందిచవచ్చు, లబ్ధిదారులు సహాయాన్ని కోరవచ్చు.

ఎప్పుడు?

ProZ Pro Bono ప్రోగ్రామ్‌ ఒక కొనసాగుతున్న కృషి, ఏడాది పొడవునా సేవలు లభ్యమవుతాయి. భాషా నిపుణులు ఎప్పుడైనా సైన్‌అప్‌ చేయవచ్చు, అవసరమైనప్పుడంతా లాభాపేక్ష లేని సంస్థలు లేదా వ్యక్తులు వారి విజ్ఞప్తులను సమర్పించవచ్చు. అత్యవసర భాషా సంబంధ అవసరాలకై తక్షణ ప్రతిస్పందన కోసం సమయానుకూలతకు అనుమతి ఉంది.​

ఎందుకు?

ProZ Pro Bono ప్రోగ్రామ్ అన్నది అత్యవసర సమాచారం, సేవలు పొందడానికి లేదా అందించడానికి ఇతరత్రా ఇబ్బంది పడేవారి కోసం భాషాపరమైన అంతరాన్ని పూడ్చే కీలక ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది. ఇది ProZ.com యొక్క మూల విలువలతో ఏకీకృతం అవుతుంది, ఇది ప్రపంచంలో ఒక అర్థవంతమైన మార్పును తీసుకొని రావడానికి అనువాదకులు మరియు వ్యాఖ్యాతల సమూహంలో అంతర్గత సహకారం మరియు మద్ధతును పెంపొందిస్తుంది. అంతర్జాతీయంగా సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి, తెలియపరచడానికి, అందుకోవడానికి ప్రోత్సహించే ఒక విస్తృతస్థాయి లక్ష్యాన్ని ఈ ప్రోగ్రామ్‌ నెరవేరుస్తుంది.

ఈ ప్రోగ్రామ్‌ ప్రేమతో, ప్రభావంతమైన ప్రయత్నంగా ఉంటుంది, ఇది ప్రపంచవ్యాప్తంగా అవసరమైన వారికి భాషా నిపుణులు వారి కీలకమైన సేవలు, నైపుణ్యాలను అందించడానికి బలోపేతం చేస్తుంది. ProZ Pro Bono ప్రోగ్రామ్‌లోని వాలంటీర్‌ అనువాదకులు, వ్యాఖ్యతలు తమ వ్యక్తిగత లబ్ధి కోసం కాకుండా, వారి సేవలు, నైపుణ్యాలను భాషాపరమైన మద్ధతు అవసరమైన వారి జీవితాలలో ఒక సానుకూల ప్రభావాన్ని కలిగించడానికి వినియోగిస్తారు.

Translated by: Dattatreya Gujjula అనువదించినది: దత్తాత్రేయ గుజ్జుల

bottom of page